దుబ్బాక నియోజకవర్గంలో దూసుకపోతున్న సీనియర్ జర్నలిస్ట్ నాయిని రాజగోపాల్.

*నియోజకవర్గంలో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు
* పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 2, జనం సాక్షి.
దుబ్బాక నియోజకవర్గంలో పలు సేవాకార్యక్రమాలు చేసుకుంటూ
ఇటు రాజకీయల్లో తనకుతానుగా ముందుకు దుసుకేళ్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న చేగుంట మండలం పులిమామిడి (కిష్టాపూర్) మాజీ సర్పంచ్ సీనియర్ జర్నలిస్ట్ దుబ్బాక నియోజకవర్గం బిజెపి నాయకులు నాయిని రాజగోపాల్
 నిరంతరం ప్రజలమద్యే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ తనకు తోచినంతగా ఆర్థిక సహాయాలు అందించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్నారు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి జేఏసీ దౌల్తాబాద్ మండల మీడియా కన్వీనర్ గా సేవలందించారు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటు అటు ప్రజలతో మమేకమై ఇటు రాజకీయల్లో చురుకుగా ఉంటూ పార్టీ కార్యకర్తల అభిమానం సైతం చూరగొంటున్నారు
 దుబ్బాక నియోజక వర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంలో భాగంగా గత సెప్టెంబర్ 17 దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా మండల కేంద్రమైన దౌల్తాబాద్ లోని సపాయి కార్మికులకు తన తల్లి అయిన కీర్తిశేషులు నాయిని వెంకమ్మ గారి జ్ఞాపకార్థం బట్టల పంపిణీతో పాటు సన్మానం చేశారు అలాగే నియోజకవర్గ స్థాయిలో ఆగస్ట్ 1 తేదీన పలు ప్రభుత్వ వసతిగృహాలు పాఠశాలల్లో నోట్ పుస్తకాల పంపిణీ చేశారు నిరుపేదల సంక్షేమం కోసం నిరంతరం ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్యనే ఉంటు అపద ఎక్కడా ఉంటే రాజగోపాల్ అక్కడ ఉంటాడు అనే పేరు సీనియర్ జర్నలిస్ట్ నాయిని రాజగోపాల్ సొంతం 2013లో చేగుంట మండలం పులిమామిడి (కిష్టాపూర్) సర్పంచ్ గా గెలవకముందు తెరవెనుక రాజకీయాల్లో నియోజకవర్గ స్థాయిలో కీలక భూమిక పోషించాడు 2017 సర్పంచ్ గా కొనసాగుతున్న సమయంలో దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో సన్నిహిత సంబంధం కారణంగా 2017లో టిఆర్ఎస్లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అటు సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు ఏలాంటి సమస్యలు ఉన్న ఆపదలో సంపదలో ఉంటూ తనకు తోచిన మేరకు ఎంతో కొంత సేవా చేయాలనే తపనతో ఆర్థిక సహయం అందిస్తున్నారు గ్రామాలలో ఎవరికైనా ఆపద వచ్చినా సహాయం చేసే గుణం ఉంది రాజకియ ఉద్ధండులు దివంగత నేత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తో గతంలో అత్యంత సన్నిహితుడుగా ఉంటూ నాటి దొమ్మాట నియోజకవర్గంలో 2004, 2018 ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలుపు కోసం ఎంతో శ్రమించి పని చేశాడు,మంచికి మారు పేరుగా గుర్తింపు తెచ్చుకున్న రాజగోపాల్ అందరికీ సేవా చేస్తున్నాడు తన సొంత బలంతో రాజకీయంగా ముందుకు సాగుతూ తనకుంటు ప్రత్యేకత సాదించుకుంటూ ముందుకు సాగుతున్న రాజగోపాల్ ను కొంత మంది రాజకియ నాయకులు వాడుకొని వదిలేసిన సందర్భాల్లో ఇబ్బందులకు గురైనా తన మొండితనంతో ముందుకు సాగుతూ సేవా కార్యక్రమాల్లో తనకు తాను ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ప్రజలకోసం పరితపిస్తూ ముందుకు సాగుతున్నారు గత దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపులో రాజగోపాల్ పాత్ర చాలా కీలకంగా ఉంది క్షేత్ర స్థాయిలో అందరితో మమేకమై పార్టీలకతీతంగా ఆయనకున్న పరిచయాలతో దుబ్బాక బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు అయితే అందరికీ సేవా చేస్తున్న రాజగోపాల్ ప్రస్తుతం బీజేపీలో కోన సాగుతున్నాడు 2001 తన స్వ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయినా అక్కడ గెలవాలనే తపనతో 2013లో పోటీ చేసి గెలిచారు అనంతరం ప్రత్యక్ష రాజకియలలోకి వచ్చిన రాజగోపాల్ జర్నలిస్ట్ గా ప్రజాప్రతినిధిగా రాజకీయ పార్టీల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకొని ముందుకు దూసుకుపోతునారు అందరికీ సేవా చేస్తున రాజగోపాల్ రానున్న అసేంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాడానికి సిద్ధపడుతున్నటు తెలుస్తుంది అటు సేవా కార్యక్రమాలు ఇటు రాజకియల్లో దూసుకుపోతున్న రాజగోపాల్ కు దుబ్బాక నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో ప్రజాదరణ ఉంది బీజేపీతో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు ఉంది ఎదిఏమైన అటు సామాజిక సేవా చేస్తు ఇటు రాజకీయల కొనసాగుతున్న రాజగోపాల్ ప్రజల సహకారంతో ముందుకు సాగుతున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ టిక్కెట్ ఆశిస్తూ పార్టీ కార్యకర్తలు నాయకులతో మమేకమై ముందుకు సాగుతున్న రాజగోపాల్ కు రాజకీయ యోగం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.