దుర్గామాత అమ్మవారి మంటపంలో అన్నదానం

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 27:
చిగురుమామిడి మండల కేంద్రంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలులో భాగంగా శాంతినగర్ కాలని శివాలయంలో నెలకొల్పిన అమ్మవారి మంటపంలో మంగళవారం మ్యాన మహేందర్-కవిత దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆలయ అర్చకులు ఆకవరంమఠం శివప్రసాద్ సమక్షంలో బాల త్రిపుర సుందరీ దేవిఅవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరించిన ఎంపీపి కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, ఉప సర్పంచ్ ముక్కెర పద్మ సదానందం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్, డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, రామంచ ఉపసర్పంచ్ కిషన్ రెడ్డి, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్ రెడ్డి తోపాటుగా దుర్గాదేవి ఉత్సవ కమిటీ నిర్వహుకులు ఉల్లెంగుల శ్రీకాంత్, గుర్రం చంద్రశేఖర్, పెనుకుల శివకృష్ణ, కోనేటి అజయ్, తేరాల అమర్, సింగాపురం శివమణి, ఉల్లెంగుల సదానందం, బైండ్ల సదానందం, చందబోయిన వెంకటమల్లు, పాశం సంపత్, కాటం అనిల్, పెనుకుల తిరుపతి పోటు సుధిమణ్ రెడ్డి, ఆకవరంమఠం సాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులతో పాటు మాత దీక్షపరుల స్వాములతో పాటు గ్రామస్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మ్యాన మహేందర్-కవిత దంపతులను ఎంపీపి కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్ ఉత్సవ కమిటీ సభ్యులు శాలువతో సన్మానించారు.