దెందులూరు రోడ్డు ప్రమాదంలో 6కి చేరిన మృతుల సంఖ్య
దెందులూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరెపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు మృతుల సంఖ్య ఆరుకి చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. ఘటనాస్థలిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


