దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం  చెల్లించాలి.

దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం  చెల్లించాలి.
లేని పక్షంలో రైతు ధర్నాను ఉదృక్తం చేస్తాం.
జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్.
కోటగిరి మార్చి 23 జనం సాక్షి:-ప్రస్తుత ఖరీఫ్,గత 2021 ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతుల పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్,పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం పోతంగల్ మండల కేంద్రంలోనీ చెక్పోస్ట్ వద్ద ఉమ్మడి కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంట నష్ట పరిహారం కోసం రైతులతో రైతు ధర్నా చేపట్టారు.అనంతరం పోతంగల్ మండల తహసి ల్దార్ కు కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు,రైతులు మాట్లాడుతూ.ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న సన్ఫ్లవర్,మొక్కజొన్న,శనగ,తొగరు పంటలకు గత 2 సం.లు గడుస్తున్న నేటి వరకు కెసిఆర్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించక పోవడం ప్రభుత్వ రైతు వ్యతిరేక పాలనకు అద్దం పడుతుందన్నారు.ఈ నెలలో జరిగిన పంట నష్టంపై యాత్ర ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా సుంకిని గ్రామంలో టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఅర్ఎస్ నాయకులు మాట్లాడిన తీరు బెదిరింపు రాజకీయా లకు అద్దం పడుతున్నాయని అన్నారు.రైతులపై బిఆర్ఎస్ నాయకులకు అంతగా ప్రేమ ఉంటే ప్రస్తుత,గత పంట నష్ట పరిహారాని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు నష్టపోతే ఆరు నెలల గడువులోనే ఆ రైతుకు నష్టపరిహారాన్ని చెల్లించేలా ప్రభుత్వం  కార్యచరణ చర్యలు చేపట్టిం దన్నారు.రైతు సంక్షేమం కోసం ఏక కాలంలో రైతు రుణమాఫి,పలు రకాల ఇన్పుట్ సబ్సిడీలు కాంగ్రెస్ హయాంలో రైతులకు అందజేయడం జరిగిందన్నా రు.అనంతరం ఈ రైతు ధర్నా కార్యక్రమంలో ఉమ్మడి కోటిగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, డిసిసిబి డెలిగేట్ సభ్యులు కొట్టం మనోహర్,హను మంతు,మాజీ జెడ్పిటిసి పుప్పాల శంకర్,ఎత్తొండ మాజీ సింగిల్ విండో చైర్మన్ సోమ శంకర్, పిఎసిఎస్ పొతంగల్ వైస్ చైర్మన్ గంధపు పవన్,పోతంగల్ గ్రామ అధ్యక్షులు పి సాయిలు, మాజీ ఎంపీటీసీ హన్మంతు,బాన్సువాడ నియోజక వర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంధపు రాజు,మండల యూత్ అధ్యక్షులు మన్సూర్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ అభిషేక్,అరుణ్ కుమార్,తయ్యబ్, హైమద్,ఆనంద్,శంకర్,దత్తు,సీనియర్ నాయకులు కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.