దేవాలయం పరిశీలించిన సంపత్ కుమార్
మానవపాడు, ఆగస్టు 30 (జనం సాక్షి): మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ గ్రామంలోని రామాలయంలో నాలుగు రోజుల క్రితం దొంగతనం జరిగిందని తెలుసుకుని వెళ్లి రామాలయం ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకొని చరవాణి ద్వారా ఎస్ఐ తో మాట్లాడుతూ మునుముందు ఇటువంటివి జరగకూడదని వీలైనంత త్వరగా దొంగలను పట్టుకోవాలని సూచించారు. గ్రామ ప్రజల సమక్షంలో సీసీ కెమెరా అమరు స్తామని హామీ ఇచ్చిన మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్, ఆయనతోపాటు మన పాడు ఎంపీపీ అశోక్ రెడ్డి, కొర్విపాడు ఎంపిటిసి గిరి రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేల్పుల రవి కిరణ్ తదితరులు ఉన్నారు.