దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.

బెల్లంపల్లి, మార్చ్ 3, (జనంసాక్షి )
బెల్లంపల్లి మండలం చిన్నబుదా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పబ్బతి హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులను శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆధ్యాత్మిక చింతన, భక్తి భావంతో సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ రాణి – సురేష్, సర్పంచ్ కృష్ణమూర్తి, నాయకులు మల్లేష్, రఘు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.