దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి

share on facebook

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. అయితే రోజూవరీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 350 మంది మ‌ర‌ణించారు. ఈ మ‌హ‌మ్మారి నుంచి మ‌రో 36,275 మంది కోలుకున్నారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,70,640 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అటు ఇప్పటివ‌ర‌కు వైరస్ కారణంగా 4,38,560 మంది బ‌ల‌య్యారు. అలాగే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,19,59,680కి చేరింది. కేర‌ళ‌లో కొత్తగా 19,622 కేసులు న‌మోదు కాగా, 132 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.13 శాతంగా ఉండగా.. రికవరీ రేట్ 97.53 శాతంగా ఉంది. మరోవైపు నిన్న ఒక్క రోజులో 59,62,286 మందికి టీకా వేయగా.. ఇప్పటిదాకా 64,05,28,644 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Other News

Comments are closed.