ధర్మానతో మంత్రుల సంప్రదింపులు!

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ వ్యవహారంలో నిందితుడుగా పేర్కొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా యోచనను విరమించుకోవాలని సహచర మంత్రులు ఆయనకు సూచిస్తున్నట్లు  సమాచారం ఢిల్లీలో ఉన్న ధర్మానతో మంగళవారం పలువురు మంత్రులు ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ధర్మాన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. ఛార్జీషీట్‌లోని  అంశాలను పరిశీలించిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆయన భేటీకానున్నారు. ఛార్జిషీట్‌లో అంశాలను పరిశీలించాకే మరోసారి ఢిల్లీ పెద్దలకు వివరణ ఇచ్చే యోచనలో ధర్మాన ఉన్నట్లు తెలుస్తోంది.