నందమూరి వంశానిక చంద్రబాబు పార్టీ బాధ్యతలు అప్పగించాలి

హైదరాబాద్‌: చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పార్టీ వాధ్యతలను నందమూరి వంశానికి అప్పగించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించెకోవాలని ఆయన హైదరాబాద్‌లో అన్నారు. లేనిపక్షంలో అక్టోబర్‌ 14న లక్షమందితో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.