నగరంలో మరోమారు డ్రగ్స్ కలకలం
హైదరాబాద్,సెప్టెంబర్1(జనం సాక్షి ): నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. బేగంపేట బీఎస్ మక్తాలో డ్రగ్స్ పంపిణీ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన నిందితుడు ఆఫ్రికాకు చెందిన పీటర్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి 100 గ్రాముల కొకైన, రూ. లక్ష స్వాధీనం చేసుకున్నారు. పీటర్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు.. అతన్ని విచారిస్తున్నారు. అతడి ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు.




