నర్సుల సమ్మెతో స్తంభించిన వైద్యసేవలు

హైదరాబాద్‌: ఉస్మానియా ఆసుపత్రిలో నర్సుల సమ్మె కొనసాగుతుంది. నాలుగు రోజులుగా సమ్మె చేపట్టి నర్సులు విధులు బహిష్కరించడంతో వైద్య సేవలు స్తంభించిపోయాయి. వైద్య అందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే నేటి నుంచి అత్యవసర సేవలూ నిలిపివేస్తామని నర్సులు హెచ్చరించారు.