నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసిన తెలుగుదేశం

హైదరాబాద్‌: పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నందున నలుగురు శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య (నూజీవీడు) వేణుగోపాలాచారి (ముధోల్‌), హరీశ్వర్‌రెడ్డి, (పరిగి) బాలనాగిరెడ్డి (మంత్రాలయం)లను పార్టీనుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలుగుదేశం ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ పాల్గొనరాదని నిర్ణయించినప్పటికీ వీరు ఓటు వేశారు.