నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 85 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 30 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్లతో రూపాయి మారక విలువ 17 పైసలకి తగ్గి 55.83కు చేరింది.