నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: ఈరోజు సెన్సెక్స్‌ కేంద్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం పెద్దఎత్తున ర్యాలీ కొనసాగిన మార్కెట్లో, ఈరోజు మాత్రం అస్థిరత్వం కన్పించింది. ప్రారంభంలో నమోదైన లాభాలను తుడిచిపెట్టి 79 పాయింట్ల నష్టంతో ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ దాదాపు 80 పాయింట్ల నష్టంతో 18,673 వద్ద స్దిరపడగా, నిఫ్టీ 21 పాయింట్ల పడిపోయి 5,669 వద్ద స్థిరపడింది.