నాగోల్ డివిజన్‌లో పైపుల మరమ్మత్తు
నేడు నిలిచిపోనున్న నీటి సరఫరా
హైదరాబాద్,ఆగస్ట్17(జనం సాక్షి): వాటర్ వర్క్స్‌లో మరమ్మతుల కారణంగా నాగోల్ డివిజన్‌లో వనివారం నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. సాహెబ్‌నగర్ డివిజన్ పరిధిలో పైపులైన్ పనుల మరమ్మతుల కారణంగా 24 గంటల పాటు నీటి సరఫరా తరలింపు పక్రియను నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు. ఈ నెల 18 శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నాగోల్ డీసీపీ కార్యాలయం వద్ద ఈ మరమ్మతు పనులు చేయనున్నట్టు వివరించారు. ఈ పనుల కారణంగా 18న పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని, ఈ స్వల్ప అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సరూర్‌నగర్ సెక్షన్ పరిధి – ఎస్‌బీహెచ్ వెంచర్ 1, 2, శాతవాహన నగర్, గౌతంనగర్, శివపురి కాలనీ, లింగోజిగూడ, కాకతీయ కాలనీ పార్ట్, నారాయణపురి పార్ట్, ఎల్బీనగర్ ప్రధాన రహదారి, సౌమ్యనగర్, భగత్ సింగ్ నగర్, శంకర్ నగర్, బాపునగర్, చౌడీ ఏరియా, నరసింహపురి కాలనీ.ఎల్బీనగర్ సెక్షన్ -సహరా ఏరియా, హిమపురి కాలనీ, జడ్జీ కాలనీ, మన్సూరాబాద్, సౌత్‌ఎండ్ పార్క్, రాక్‌టౌన్ కాలనీ, చాణక్యపురి, లలిత నగర్, నువ్వులబండ, ఫతుల్లాగూడ, జనప్రియ కాలనీ, జైపురి కాలనీ, సరస్వతి నగర్, గణెళిశ్ నగర్, చింతలకుంట.దిల్‌సుఖ్‌నగర్-కమలానగర్, నేతాజీ నగర్,త్యాగరాయ నగర్, హనుమాన్ నగర్, హుడాకాలనీ, చెరుకుతోట కాలనీ, పోచమ్మ బాగ్, అంబేద్కర్ నగర్, మాతా లక్ష్మినగర్ , గడ్డిఅన్నారం మారుతీనగర్ సెక్షన్ -ఇందిరా నగర్, మోహన్ నగర్, కొత్తపేట, గాయత్రి పురం, సీటీవో కాలనీ అల్కాపురి సెక్షన్ -స్నేహపురి కాలనీ, వాసవి కాలనీ, గ్రీన్ హిల్స్ కాలనీ, లక్ష్మినగర్ కాలనీ, నాగోల్ ప్రధాన రహదారి, విజయపురి కాలనీ, సమంతపురి కాలనీ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు.



