నాడు ఉద్యమ రథసారథిగా… నేడు బంగారు తెలంగాణ రథసారథిగా కెసిఆర్  * కళ్యాణ లక్ష్మి, సిఎంఆర్ఎఫ్  చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ

టేకులపల్లి, మార్చి 4( జనం సాక్షి ): తెలంగాణ సాధన కోసం ఉద్యమ ప్రదాత నాడు ఉద్యమ రథసారథిగా, నేడు బంగారు తెలంగాణ సాధన కోసం రథసారధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిపాలన దక్షతతో అన్ని వర్గాల ప్రజలకు  మేలుకొలిపే విధంగా అట్టడుగు వర్గాలకు కూడా తను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేయూతనిస్తున్నాయని ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరి సింగ్ నాయక్ పేర్కొన్నారు. శనివారం టేకులపల్లి మండల కేంద్రంలోని  తహసిల్దార్ కార్యాలయం నందు అర్హులైన 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను,  సిఎంఆర్ఎఫ్ 11 చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కెసిఆర్  తలపెట్టిన పథకాలలో కళ్యాణ లక్ష్మి పథకం దేశంలోనే గొప్ప పథకంగా నిలిచిపోయిందని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి అండదండగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్  అని అన్నారు.నిరుపేదింట్లో ఆడపడుచులు ఘనంగా పెళ్లి జరుపుకోవాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 50వేల రూపాయలు ఉన్న కళ్యాణ లక్ష్మి నేడు అంచెలంచెలుగా పథకంలోని డబ్బులు రెట్టింపు చేస్తూ నేడు రూ.100116/- రూపాయలను తెలంగాణ లబ్ధిదారులకు అందజేయడం చాలా గొప్ప విషయమన్నారు. నిరుపేద కుటుంబంలో కళ్యాణ్ లక్ష్మి, కళ్యాణ కాంతులు నిండాయని పేదింటి  ఆడపడుచుల తల్లిదండ్రులకు ఎంతో భరోసానిస్తుందన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేస్తున్న సమయంలో ఉద్యమకారుడుగా తెలంగాణలోని ఒక మారుమూల తండాకు సీఎం కేసీఆర్  వెళ్లారని, అక్కడ ఒక యువతి తల్లిదండ్రులు ఆమె కూతురి పెళ్లి కోసం ఎంతో కష్టపడి జమ చేసుకున్న డబ్బులు ప్రమాదవశాత్తు