నాలుగోరోజుకు చేరుకున్న ప్రపంచ ఆధ్యాత్మిక మహాసభలు
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని మానస సరోవర్ ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ ఆధ్యాత్మిక మహాసభలు నేటితో నాలుగోరోజుకు చేరుకున్నాయి. సద్గురు మంగేష్ఠ క్రియ యోగ గురువారం సభలో పాల్గొని ప్రసంగించారు. యోగ, ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి వివేచనశక్తిని అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలందరూ ధ్యానాన్ని సాధన చేస్తే సమాజం సామరస్యంగా తయారవుతుందని సద్గురు మంగేష్ఠ అన్నారు.