నిందితుడు ఎవరో తెలిసింది : డీజీపీ దినేశ్‌రెడ్డి
హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో ఒక వర్గం వారినే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామన్న వాదన సరికాదని సరికాదని డీజీపీ దినేశ్‌రిడ్డి అన్నారు. పేలుళ్లకు కారణం ముస్లిం జిహాదీ గ్రూపులా లేక హిందూ అతివాద సంస్థలా అని ఇంకా గుర్తించలేదని చెప్పారు. కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోందన్నారు. సీసీటీవీ పుటేజీ ద్వారా నిందితుడు ఎవరన్నది తెలిసింది.. ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాల్సి ఉందని చెప్పారు.