నిందితుల విచారణకు ఈడీకి అనుమతి

హైదరాబాద్‌: ఎమ్మార్‌, ఓఎంసీ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో జైలులో ఉన్న నిందితుల విచారణకు ఈడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది.నిందితులను 15 రోసుల్లోగా విచారించాలని న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. ఓఎంసీ కేసులో శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డి, బీపీ ఆచార్యలను ఈడీ విచారించనుంది. ఎమ్మార్‌ కేసులో బీపీ ఆచార్య, కోనేరు ప్రసాద్‌, సునీల్‌రెడ్డి, విజయరాఘవను ప్రశ్నించేందుకు ఈడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది. నిందితుల తరపు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని న్యాయస్తానం తన ఆదేశాల్లో తెలిపారు.