నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామం: మంత్రి మహీధర్‌ రెడ్డి

హైదరాబాద్‌: పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి మహీధర్‌ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం వాస్తవాలకు దగ్గరగా ఉండేలా అధికారులు చోరవ చూపాలని ఆయన కోరారు. హైదరాబాద్‌ జూబీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలమెంట్‌ అధికారులకు రాష్ట్ర స్థాయి వర్క్‌షాపును నిర్వహించారు. కార్యక్రమంలో రాజీవ్‌ యువకిరణాలపై ప్రత్యేకంగా చిర్చంచారు. నిరుద్యోగ యువత అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు. యువతకు కనీస వేతనాల చట్టాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పాటించాలిని మంత్రి కోరారు. తక్కువ వేతనాలు ఇచ్చే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.