నిరుపేద కుటుంబానికి చేయూత అతిధి బిల్డర్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి
వీణవంక మార్చి 15( జనం సాక్షి) వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన అడిగోప్పుల లక్ష్మి- శంకరయ్య పుత్రిక హర్షిని కి, కార్తీక్ తో వివాహం ఈ రోజు బుధవారం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన హర్షిని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నూతన వధువు హర్షిని కుటుంబ సభ్యులకి అతిథి బిల్డర్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి స్పందించి పుస్తే మట్టెలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కాగా అట్టి పుస్తె మట్టేలను రాకేష్ రెడ్డి నర్సింగాపూర్ గ్రామ యువ సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు పోతరవేన సతీష్, రాజి రెడ్డి, చంద్రమౌళి, దూడం నరసయ్య, ముద్దం తిరుపతి, కొమురయ్య, సతీష్, సాగర్, కరుణాకర్, శ్రీను, సమ్మయ్య సార్, గణేష్ రెడ్డి, అంజి, అడిగోప్పల సత్యనారాయణ, రాజమల్లు యువ సైన్యం సభ్యులు వివాహ వేడుకకు హాజరై రాకేశ్ రెడ్డి తరఫున పుస్తె మట్టె లను అందించి నూతన వధూవరులను ఆశీర్వదించారు.