నిరుపేద వివాహానికి ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్

జనసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజక వర్గం పరిధిలోని బామ్ల నాయక్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మూడ్ సమ్మయ్య,యమున కుమార్తె వెన్నెల వివాహానికి గ్రామ సర్పంచ్ రాజు నాయక్ పది వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. గ్రామంలో జరిగే ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నందుకు పెళ్లిలో ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సతీమణి లక్ష్మీ తో పాటు వార్డు సభ్యులు శారదా, సామెల్ సమ్మక్క సన్నీ జైపాల్,తిరుపతి, మరియు రాజేష్, తిరుపతి, శివ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.