నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కన్కాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతు భూమిని కబ్జా చేసిన అబ్దూల్లాపూర్ వీడిసి,సర్పంచ్ లకు నిరసనగా ఆందోళన
భైంసా రూరల్ మార్చ్ 20జనం సాక్షిభైంసా రూరల్ మార్చ్ 20జనం సాక్షి
చేసారు.కన్కాపూర్ రైతు గంగన్న కు మద్దతుగా గ్రామస్థులంతా కలిసి అంబెద్కర్,చాకలి ఐలమ్మ,బుద్ద విగ్రహాలకు పూలమాల వేసి వినతి పత్రాన్ని అందజేసారు.కన్కాపూర్ నుండి ఘటణ స్థాలానికి డప్పుచప్పుల్లతో ర్యాలి నిర్వహించారు. పలుమార్లు అదికారులకు విన్నవించుకున్న స్పందన కరువైందని బాదితులు ఆవేదన చెందుతున్నారు.కన్కాపూర్ శివారులోని 328 సర్వే నంబర్ లో గల ఐదు ఎకరాల భూమిలో 30 సంవత్సరాలుగా సాగు చేస్తున్న పంట భూమిని అబ్దుల్లాపూర్ సర్పంచ్,వీడిసీ చైర్మెన్ లు కలిసి భూమిని కబ్జా చేసారని..గుడి కోసం నిర్మాణాలు కూడా చెపట్టారని..ప్లాట్లు కూడా చేసి అమ్ముకునె ప్రయత్నాలు జర్పుతున్నారని ఆవేదన చేందుతున్నారు.రెవెన్యు అధికారులు,పోలీసు యంత్రాంగం కూడా కబ్జాదారు వెంటె ఉన్నారని..జేసిబీ తో దున్ని భూమిని చదును చేసారని అంటున్నారు.అధికారులు స్పందించి కబ్జాదారుల నుండి దళిత భూమిని విడిపించాలని కొరుతున్నారు.