నిలిచిన హైదరాబాద్‌-బ్యాంకాక్‌ విమానం

హైదరాబాద్‌: శంషాబాద్‌లో నిలిచిన బ్యాంకాక్‌ విమానం హైదరాబాద్‌ నుండి బ్యాంకాక్‌ వెళ్లాల్సిన పాయి ఎయిర్‌లైన్స్‌ విమానం సాంకేతికలోపంతో శంషాబాద్‌ విమానశ్రయంలో నిలిచిపోయింది. సాంకేతికలోపాన్ని  సరిదిద్దేందుకు విమానాశ్రయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటలకు విమానం బ్యాంకాక్‌కు బయలుదేరుతుందని  అధికారులు తెలియజేశారు.