నివేదిక ఇవ్వలేదు: గవర్నర్‌

న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితుల పై కేంద్ర హోం మంత్రి చిదంబరానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని గవర్నర్‌ నరసింహన్‌ తెలియజేశారు. రాజధాని పర్యటనలో ఉన్న గవర్నర్‌ చిదంబరంతో ఈ ఉదయం సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలియజేశారు. మెడికల్‌ సీట్ల విషయంలో పరిశీలన జరుపుతున్నామని అన్నారు. రాష్ట్రపతి పదవీ కాలం  ముగియనున్న నేపథ్యంలో ప్రతిభాపాటిల్‌ను ఈ మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు అన్నారు.