నీటితొట్టెలో పడి ఫారుక్‌ మృతి

చిత్తూరు: నీటితొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కదిరి రోడ్డులో చోటుచేసుకుంది. మహబూబ్‌బాషా, రిజ్వాన్‌ దంపతులకు ఏకైక కుమారుడు ఫారుక్‌(3). మంగళవారం ఉదయం ఫారుక్‌ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ తెరిచి ఉంచిన నిటీతొట్టెలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో చిన్నారిని బయటకు తీసి అసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు తెలియజేశారు.