నీటి పారుదల పథకాలకు రూ.1.48 కోట్లు విడుదల

ఖమ్మం, అక్టోబర్‌ 8 : జిల్లాలో నూతన ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి, చెరువుల మరమ్మతులకు గాను, 1.48 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మధిర మండలం వంగవీడు గ్రామంలో రెండవ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 1.18 కోట్ల రూపాయలు విడుదలకు పాలనా పరమైన ఆమోదం లభించింది. దీని ద్వారా ఆయకట్టు పరిధిలోని 152 ఎకరాలకు సాగునీరు అందనుంది. ముదిగొండ మండలం బాణాపురం, తాళ్లకుంట చెరువుల మరమ్మతులకు 14.5 లక్షల రూపాయలు నిధులు విడుదలైనట్లు తెలిపారు.