నీటి పారుదల శాఖ కార్యాలయానికి తాళం వేసి నిరసన

తెనాలి: కృష్టా పశ్చిమ డెల్టా కాలువలకు నీటి సరఫరాలో స్థానిక నీటి పారుదల శాఖ ఇంజినీరు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని రైతులు ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలోని నీటిపారుదల శాఖ కార్యాలయారికి తాళం వైసి రైతులు ఆందోళనకు దిగారు. ఈఈ రైతులకు అందుబాటులో లేకుండా ప్రకటించిన మేరకు సాగునీరు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్‌ ఛైర్మన్‌ సుంకర హరికృష్ణ ఈ సందర్భింగా ఆరోెపించారు.