నూతనంగా వచ్చిన నయాబ్ తహసిల్దార్ విజయ్ కుమార్ బాధ్యతలు
రాయికోడ్ జనం సాక్షి మార్చి 10 రాయికోడ్ మండల కేంద్రానికి నూతనంగా వచ్చిన నయాబ్ తహసిల్దార్ విజయ్ కుమార్ సార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు పూలమాల శాలువాతో సన్మానించారు. ఇంతకుముందు ఉన్న రాజు నారాయణఖేడ్ కు బదిలీ కావడం జరిగింది. ఆర్ ఐ ప్రభాకర్ సార్ మండల అధ్యక్షుడు వీరేందర్ కార్యదర్శి శివకుమార్ వీఆర్ఏలు అశోక్ శ్రీశైలం సుజాత విజయ్ లక్ష్మి ఆపరేటర్లు సుధాకర్ సంపత్ పాల్గొన్నారు.