నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ
బిచ్కుంద మార్చి 08 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల శెట్లూర్ మరియు చిన్న దడ్గి గ్రామాల్లో బుధవారం నాడు నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎంపీపీ అశోక్ పటేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్ భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఎన్.ఆర్ ఈజిఎస్ నిధులు 25 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని వారన్నారు. అనంతరం మాన్యాపూర్ గ్రామంలో నాలుగు లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు పుష్ప పండరి, అనిత విఠల్ రెడ్డి, దాసరి రాములు, ఆకుల సాయిలు, వెంకట్రావు దేశయ్, మైపతి హన్మండ్లు, రాంచందర్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.