నెల్లూరు రైల్వే స్టేషన్‌ వద్ద బంధువుల ఆందోళన

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటన జరిగి 30 గంటలు గడుస్తున్నా ఇంకా కొందరి ఆచూకీ లబించలేదంటూ నెల్లూరు రైల్వే స్టేషన్‌ వద్ద బంధువులు అధికారులను నిలధీశారు. ఎస్‌-11 బోగీలో ప్రయాణిస్తున్న తమ బంధువుల ఆచూకీ ఇంత వరకు లభించలేదని కనీసం సమాచారం చెప్పేవారు. కరువయ్యారంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలుగా రైల్వే స్టేషన్‌ వద్ద పడిగావులు పడుతున్నామని తమ బంధువుల వస్తువులు, కాలిన వస్త్రాలు కనిపిస్తున్నా వాటిని తమకు చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో  రైల్వే స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైల్వేశాఖ వైఫల్యంపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.