నేటి నుంచి అప్పన్న చందనం విక్రయాలు

విశాఖ: సింహాద్రి అప్పన్న చందనం విక్రయాలను ఈ ఉదయం ప్రారంభించారు. స్వామివారి చందనం కోసం భక్తులు బారులు తీరారు. రోజుకు 500 ప్యాకెట్లను విక్రయించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పలువురు భక్తులు చందనం అందక వెనుతిరిగిపోయారు.