నేడు నగరంలో తెదేపా సమరభేరీ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజధానిలో తెదేపా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు తలసాని శ్రీనివాసరావు నేతృత్వంలో నిజాం కళాశాల మైదానంలో సమరభేరీ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జంట నగరాల్లో తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ… కాంగ్రెస్‌ సర్కార్‌ అసమర్థతను ఎండగడతామని తలసాని చెప్పారు.