నేపాల్లో భారత్‌ నకిలీ నోట్ల కుంభకోణం

న్యూఢిల్లీ: నకిలీ నోట్ల కుంభకోణాన్ని కట్టడి చేసేందుకు భారత్‌, నేపాల& పరస్పర సహకారం అందించుకుంటున్నాయి. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గత ఏడాది అయిరు కోట్ల రూపాయల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. నేపాల్లో నకిలీ నోట్ల కుంభకోణం కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. ఇటీవల కూడా ఖట్మాండూలో నకిలీ నోట్ల ముఠా ఉన్నట్లు భారత్‌కు సమాచారం అందగా. నేపాల్‌ ప్రభుత్వ సాయంతో వారిని అరెస్ట్‌ చేసినట్లు వివరించారు.