నేషనల్ పంచాయతి అవార్డ్స్ కార్యదర్శులు సర్పంచులకు ఘనంగా సన్మానం¶
నేషనల్ పంచాయతీ అవార్డ్స్ సీల్డ్ సర్టిఫికెట్లు అందజేత•
మహా ముత్తారం మార్చి 24( జనం సాక్షి) నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2021-22 పోటీలో మహాముత్తారం మండల పరిధిలోని 9 థీమ్ లలో ప్రథమద్వితీయతృతీయ స్థానాలను పొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్ లు మరియు పంచాయతీ కార్యదర్శులకు షీల్డ్, సర్టిఫికేట్ మరియు దుశ్శాలువా తో ఘనంగా సన్మానించడం జరిగింది. శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రత్నం సుభద్ర మండల అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నేషనల్ అవార్డును అందిస్తూ ఘనంగా శాలువాలతో సత్కరించారు.మొదటి థీమ్ లో ప్రథమ స్థానంలో పెగడపల్లి ద్వితీయ స్థానంలో స్థంభంపల్లి పిపి తృతీయ స్థానంలో కనుకునూరు రెండవ థీమ్ లో మండల ప్రథమ స్థానంలో సింగారం తృతీయ స్థానంలో జీలపల్లి
మూడవ థీమ్ లో ప్రథమ స్థానంలో ములుగుపల్లి ద్వితీయ స్థానంలో నల్లగుంట మీనాజిపేట తృతీయ స్థానంలో రెడ్డి పల్లి నాలుగవ థీమ్ లో ప్రథమ స్థానంలో కనుకునూరు ద్వితీయ స్థానంలో జీలపల్లి తృతీయ స్థానంలో సింగంపల్లి ఐదవ థీంలొ ప్రథమ స్థానంలో జీలపల్లి ద్వితీయ స్థానంలో పెగడ పల్లి తృతీయ స్థానంలో పోలారం ఆరవ థీమ్ లో ప్రథమ స్థానంలో నల్లగుంట మీనాజిపేట ద్వితీయ స్థానంలో బోర్లగూడెం, తృతీయ స్థానంలో సింగంపల్లి, ఏడవ థీమ్ లో ప్రథమ స్థానంలో బోర్లగూడెం, ద్వితీయ స్థానంలో ప్రేంనగర్ తృతీయ స్థానంలో కనుకునూరు ఎనమిదవ థీమ్ లో ప్రథమ ప్రథమ స్థానంలో బోర్లగూడెం ద్వితీయ స్థానంలో నల్లగుంట మీనాజిపేట ద్వితీయ తృతీయ స్థానంలో స్థంభంపల్లి పిపి, తొమ్మిదవ థీమ్ లో ప్రథమ స్థానంలో రెడ్డి పల్లి ద్వితీయ స్థానంలో సింగంపల్లి తృతీయ స్థానంలో ములుగుపల్లి గ్రామాలు మండల స్థాయిలో ఎంపిక అయినందున వారికి మండలపరిషత్అధ్యక్షురాలు శ్రీమతి రత్నం సుభద్ర మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు శాలువా, మెమెంటో మరియు సర్టిఫికేట్ లతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి రత్నం సుభద్ర గారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచుల పాత్ర కీలకం అని వారు అందరూ చాలా కష్ట పడి పని చేస్తున్నారని ఇంకా కష్టపడి పనిచేసి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి లొ అవార్డు వచ్చేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శ్రీమతి గంట్ల ఉమాదేవి, కోర్లకుంట యంపీటీసీ కోడి అర్జయ్య మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు , పి. ఆర్ ఏఈ సురేష్, ఏపియం రామకృష్ణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, కార్యాలయ పర్యవేక్షకుడు రమేష్, సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు