పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కలెక్టర్ కు వినతి .

 

 

 

 

 

 

గోగుల రాణా ప్రతాపరెడ్డి.ఫోటో రైట్ అప్ వినతి పత్రం అందజేస్తున్న బిజెపి నాయకులు…
నర్సంపేట : మార్చి 15(జనం సాక్షినర్సంపేట నియోజకవర్గంలో పంట నష్ట పరిహారం అందించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని నర్సంపేట నియోజకవర్గ బిజెపి నాయకులు గోగుల రాణా ప్రతాపరెడ్డి బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం కు వినతి పత్రం అందజేశారు.

నర్సంపేట నియోజకవర్గంలో గత సంవత్సరం వడగల్ల వానతో జరిగిన విపత్తులో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. జనవరి, 2022లో పంట నష్ట సర్వేకు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాష్ట్ర మంత్రులు విచ్చేసి పరిశీలించి పరిహారం అందేలా చర్యలు చేపడతామని రైతాంగానికి హామీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలలో 16097 మంది రైతులకు 18000 ఎకరాలు, ఎకరానికి మిర్చికి రూ॥ 5400/- చొప్పున, ఎకరానికి మొక్కజొన్నకు రూ॥3333/- చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా మంజూరు అయినది.

సంవత్సరం తరువాత పంట నష్ట పరిహారం క్రింద సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ అకౌంట్లో ప్రభుత్వం జమా చేయడం జరిగినది. కాని నేటి వరకు నష్ట పోయిన రైతులకు పరిహారం అందలేదని పేర్కొన్నారు. మూడు నెలల క్రితమే జిల్లా కలెక్టర్ అకౌంట్లో డబ్బులు జమా అయినప్పటికి నేటి వరకు రైతులకు ఇవ్వకపోవడం దురదుష్టకరం, రైతులు పెట్టుబడులు లేక ఇబ్బందులు పడతున్న క్రమంలో నష్టపరిహారం వచ్చిన సంతోషంలో ఉన్నవారికి నేటి వరకు వారి అకౌంట్లో డబ్బులు వేయక పోవడం వలన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుచున్నారు.
కావున దయచేసి తక్షణమే నర్సంపేట నియోజకవర్గంలోని రైతుల అకౌంట్లో డబ్బులు జమాచేసి వారికి న్యాయం చేయాలని కోరుచున్నాము. లేని యెడల రైతులకు న్యాయం చేసే వరకు అందోళనలు నిర్వహిస్తామని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఆబోతు రాజు , మండల ఇంచార్జి గడ్డం ఆంజనేయులు , మాజీ మండలాధ్యక్షులు గుడిపూడి రాధాకృష్ణ , లింగాబత్తుల యాకసాయన్న ,నర్సంపేట మండల ప్రధాన కార్యదర్శి . చల్లా రాంచంద్ర రెడ్డి మహమ్మదాపురం వైస్ చైర్మన్ . పాలడుగుల జీవన్ , మహమ్మదాపురం ఉప సర్పంచ్ నేదురు రాజేందర్ , గురిజాల వార్డ్ సభ్యులు . ఆముదాల రమేష్ , నెక్కొండ మండల బీజేపీ ఉపాధ్యక్షులు దామేచర్ల రామారావు మండల బీజేపీ నాయకులు నాయిని అశోక్ , కక్కెర్ల నాగయ్య , జె. ఐలయ్య దుగ్గొండి మండల యూత్ నాయకులు ఈర సందీప్ , నర్సంపేట బీజేపీ యూత్ నాయకులు వెంకటేష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు