పండగ వేళ ప్రయాణికుల ఇక్కట్లు

హైదరాబాద్‌: సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారితో రాజధానిలోని రైల్వే, బస్‌ స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. నగరంలోని సికింద్రాబాద్‌, నాంపల్లి స్టేషన్లలో విపరీతమైన రద్దీ నెలకోంది. ప్రత్యేక, సాధారణ రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి జనరల్‌ బోగీల్లో కాలు మోపేందుకు కూడా స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గంలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు బారులు తీరాయి. దీంతో ఈ మార్గంలో టోల్‌గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.