పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు
*అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భద్రతరేగోడ్ //జనం సాక్షి //ఏప్రిల్:పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా సోమవారం ప్రారంభమయ్యాయి మండల కేంద్రమైన రేగోడు లోని ఆదర్శ పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని కొనసాగించారు. ఈ పరీక్ష కేంద్రంలో ఆరు పాఠశాలలైన రేగోడు ఆదర్శ పాఠశాలలతో పాటు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల, టి లింగంపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాల, గజవాడ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు మొత్తం 184 విద్యార్థిని గాను 183 విద్యార్థిని విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారు కాగా ఆదర్శ పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి గైరాజార్ అయినట్లు ఎంఈఓ కార్యాలయ అధికారులు తెలిపారు. సుమారు మొత్తం 17 మంది సిబ్బందితో ఈ పరీక్ష కేంద్రాన్ని కొనసాగించారు. కాగా చీప్ సూపర్డెంట్ గా, విజయ్ కుమార్, డిపార్ట్మెంటల్ అధికారిగా సుధీర్లు విధులు నిర్వహించారు. ఎలాంటి మాస్ కాపింగులకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. తహసిల్దార్ లక్ష్మణ్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎస్ఐ మల్లేశం ఆధ్వర్యంలో, జమిందార్ రవి, తన సిబ్బందితో, కట్టుదిట్టమైన భద్రతలను కొనసాగించారు.