పట్టణ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తాం

మున్సిపల్ చైర్పర్సన్ స్వరూప రాణి
3వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 29 : పట్టణ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తామని మున్సిపల్ చైర్మన్ అంకుగారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం 3వ వార్డులో సీసీ రోడ్డు అభివృద్ధి పనుల ప్రారంభానికి స్థానిక కౌన్సిలర్ మంగోలు చంటి అధ్యక్షతన ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి- శ్రీధర్ రెడ్డి లు హాజరై భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రతీ వార్డులో సీసీ రోడ్లు నిర్మించి పట్టణ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆర్.రాజేంద్ర కుమార్, మున్సిపల్ మేనేజర్ జే.ప్రభాకర్, కౌన్సిలర్లు చెవిటి లింగం, ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీష్ గౌడ్, జుబెద కతున్- ఎక్బల్, తుమ్మలపల్లి లీల-సంజివులు, ముస్త్యాల తార-యాదగిరి, కో ఆప్షన్ మెంబర్ ముస్త్యాల నాగేశ్వర్ రావు, పోతుగంటి అశోక్, రామగల్ల దేవయ్య, కరోల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.