పశువుల రాస్తారోకో… – ‘ఖని’లో వినూత్న దృశ్యం

 గోదావరిఖని, ఆగస్టు 3 (జనంసాక్షి) : ఒకటి కాదు రెండు కాదు పదుల్లో స్థానిక ప్రధాన చౌరస్తాలో నిత్యం పశువులు భైఠాయి స్తున్నాయి. ఎక్కడి నుంచో వస్తాయో కానీ మూకుమ్మడిగా ఉదయం నుం చే సాయంత్రం వరకు పశువులను రోడ్డుకు అడ్డంగా, మధ్యలో కూర్చో వడంతో… వాహనచోదకులకు ఇ బ్బందికరంగా మారింది. కొన్నిమా ర్లు ప్రమాదాలు కూడా తెచ్చిపెడుతు న్నాయి. ఈ పశువులన్నీ రోడ్డుపై కూర్చోవడంతో ఏ డిమాండ్‌ కోసం ఈ ఎద్దులన్నీ రాస్తారోకో నిర్వహిస్తు న్నాయని చూపరులు హాస్యధోరణిలో అనడం వినిపించింది. స్థానిక చౌరస్తాలో నిత్యం పహారా చేసే ట్రాఫిక్‌ పోలీసులు కూడా ఈ రాస్తారోకోను చూసిచూడనట్లు ఉండటం కొసమెరుపు.