పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు ఈ ఉదయం నీటిని విడుదల చేశారు. మొత్తం 500 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. అయితే నీటి విడుదల చేసేందుకుజనరేటర్లు పనిచేయకపోవడంతో సీఈ సాంబయ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్యువల్‌ ఆపరేటింగ్‌ ద్వారా నీటిని విడుదల చేసి బాధ్యులైన సిబ్బంది సస్పెన్షన్‌కు  సీఈ ఆదేశాలె జారీ చేశారు.