పసిడి…రూ.31 వేలు!

హైదరాబాద్‌, జూన్‌ 13 : పసిడి ధర పరుగులు పెడుతోంది. 31 వేల రూపాయల సమీపంలో ఉంది. పెళ్ళిళ్లు, ఇతరాత్ర పంక్షన్లు లేకపోయినప్పటికి బంగారం ధర పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఇన్వెస్టర్లు అయోమయానికి లోనవుతున్నారు. బుధవారంనాడు పలు మార్కెట్లలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం రూ.30,810 కాగా 22 క్యారెట్ల బంగారం 28,240కి చేరింది. కిలో వెండి ధర రూ.57,200 పలికింది. అదేవిధంగా విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.30,310 కాగా 22 క్యారెట్ల బంగారం 28,180కి చేరింది. కిలో వెండి ధర రూ.55,700లకు చేరింది. ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల బంగారం రూ.30,350 కాగా 22 క్యారెట్ల బంగారం 27,880కి చేరింది. కిలో వెండి ధర రూ.55,000 నమోదైంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.30,000 కాగా 22 క్యారెట్ల బంగారం 29,500కి చేరింది. కిలో వెండి ధర రూ.55,250 మేర పెరిగింది.