పాకిస్థాన్‌ కమ్రా ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని  కమ్రా ఎయిర్‌ ఫొర్స్‌ బేస్‌ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఇవాళ తెల్లవారుజామున సుమారు 15 మంది ఉగ్రవాదులు మిలిటరీ దుస్తుల్లో వచ్చే సైనికులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది మృతి చెందారు. పలువురు సైనికులు గాయపడ్డారు. అయితే పాక్‌ కమెండోలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమార్చారు. రాజధాని ఇస్లామాబాద్‌కు 60 కిలోమీటర్లదూరంలో ఉన్న కమ్రా పట్టణంలో ఘటన చోటుచేసుకుంది.