పాఠశాలకు మినీ ఆర్వో ప్లాంట్ సమకూర్చిన పూర్వ విద్యార్థులు

టేకులపల్లి, సెప్టెంబర్ 25( జనం సాక్షి ): తాము చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత సహాయం చేయాలి అన్న ఆలోచనను పూర్వ విద్యార్థులు నెరవేర్చి చూపారు. ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం ముత్యాలంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు అక్కడ చదివే విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. ఆరు నెలల క్రితం అదే పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. అప్పుడున్న ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజ్ఞప్తి మేరకు విద్యార్థులకు తాగునీటి కోసం మినీ ఆర్ ఓ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. తక్షణమే పాఠశాలలో మినీ ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టి 1977 నుంచి 1987 వరకు పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తలవకొంత విరాళం అందించారు. వచ్చిన సొమ్మును జాగ్రత్తపరిచి మల్లిషెట్టి నాగేశ్వరరావు అనే విద్యార్థి పనులను చేపట్టి సకాలంలో అందించారు. దానిని పూర్వ ప్రధానోపాధ్యాయుడు మంగీలాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో ముత్యాలంపాడు సర్పంచ్ రమాదేవి, కార్యదర్శి లక్ష్మీనారాయణ, పూర్వ విద్యార్థులు మలిశెట్టి నాగేశ్వరరావు, ఎస్ వెంకటేశ్వర్లు, అన్నారపు వెంకటేశ్వర్లు, బి.లాలు, ఎల్ వెంకటేశ్వర్లు, నాగులమీర, నారాయణ, జి. వెంకటేశ్వర్లు, నారం దాసు శ్రీనివాస్, నారం దాస్ వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తాజావార్తలు