పాఠశాలను పరిశీలిస్తున్న కలెక్టర్
మనఊరు-మన బడి పనులు మార్చ్ చివరి నాటికీ పూర్తిచేయాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్
భీమదేవరపల్లి మార్చి
(15) జనం సాక్షి న్యూస్
మనఊరు-మన బడి పనులు మార్చ్ చివరి నాటికీ పూర్తిచేయాలనీ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ మండలంలోని గట్ల నర్సింగాపూర్ భీమదేవరపల్లి గ్రామాలలో ‘మన ఊరు-మన బడి’ పథకం కింద కేటాయించిన పాఠశాలల పనులను పరిశీలించారు. . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఎలాంటి సదుపాయాలకు నోచుకోని ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయడానికి తీసుకొచ్చిన గొప్ప పథకం మన ఊరు – మన బడి అని అన్నారు. ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ నిర్మాణం పూర్తి చేశాకే మిగతా ప్రహరీ, అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారుల ను ఆదేశించారు. ఎంపీడీవో, ఎంపీవోలు రోజువారీగా పాఠశాలల్లో జరుగుతున్న ఈజీఎస్ పనులను పర్యవేక్షించాలన్నారు. మరోవిడత సమావేశంలోపు దాదాపు పనులు పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట పిడి శ్రీనివాస్ కుమార్ ,ఎంపీపీ జక్కుల అనిత రమేష్ యాదవ్, జెడ్పిటిసి వంగ రవీందర్, తాహసిల్దార్ ఉమా రాణి ,ఎంపీడీవో భాస్కర్,
సర్పంచ్ చంద్రకళ తిరుపతిరావు, లతోపాటు వివిధ శాఖల అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.