పాఠశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ.

ఫొటో : దుస్తులు పంపిణీ చేస్తున్న ఎంపీపీ.
నెన్నెల, మార్చ్ 31, (జనంసాక్షి )
మండలంలోని జంగాల్ పేట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జయదేవ్ తిరుమల్ రావు ఆర్థిక సహాయంతో చేపట్టిన దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ సంతోషం రమాదేవి పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల జంగాల్ పేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరు నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని, ఇలాంటి నిరుపేద విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. మున్ముందు మిగితా గ్రామాల్లోను పేదలను ఆదుకోవడానికి పలు కార్యక్రమాలు చేయాలని ఆమె సూచించారు. ఈకార్యక్రమంలో నెన్నెల ఎస్సై రాజశేఖర్, స్థానిక సర్పంచ్ రావుల సత్యనారాయణ, మన్నెగూడెం సర్పంచ్ గొర్లపల్లి బాపు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.