పాతగుట్ట బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  యాదాద్రి శ్రీపంచరూప లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ అలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నేటి నుండి బ్ర¬్మత్సవాలు  ప్రారంభమయ్యాయి…నేటి నుండి ఈనెల ఇరవై ఒకటవ తేదీ వరకు బ్ర¬్మత్సవాలు నిర్వహించనున్నారు…మొదటి రోజు బ్ర¬్మత్సవాల్లో భాగంగా అంకురార్పణ,స్వస్తివాచనం, పుణ్యాహవాచనం,రక్షాబంధనం పూజలు వేదమంత్రాలు మంగళవాయిద్యాలు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించి ప్రారంభించారు…ఈ నెల ఇరవైఒకటవ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకం తో బ్ర¬్మత్సవాలు ముగించనున్నారు..అలాగే 17వ తేదీన ఎదుర్కోల్లు,18న తిరుకల్యాణం,19వ తేదీ రథోత్సవం నిర్వహించనున్నారు.ఈ రోజు పూజల్లో ఆలయ ఈవోగీతారెడ్డి,చైర్మన్‌ నరసింహమూర్తి పాల్గొన్నారు.