హైదరాబాద్: మిషన్ కాకతీయ మూడో దశ పనుల టెండర్ల ప్రక్రియ డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేయాలని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశాలు జారీచేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, భూసేకరణ, మిషన్ కాకతీయ పనులపై మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పాటించి సంస్కరణలు ప్రవేశపెట్టాలని సూచించారు. అంచనాలు మొదలుకుని మంజూరు వరకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. మూడుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదార్ల నుంచి స్పందన లేకపోతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన లేని రూ.5లక్షలలోపు పనులను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని ఆదేశించారు.