పారిశుద్ధ్య కార్మికుల ఘర్షణ: నలుగురికి గాయాలు

నిజామాబాద్‌: నగరంలోని శివాజీనగర్‌లో పారిశుద్ధ్య కార్మికుల మధ్య ఈరోజు రాత్రి తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.