పార్టీ కర్తలను పట్టించుకోని మంత్రి మల్లారెడ్డి : బిఆర్ ఎస్వి జిల్లా కో ఆర్డినేటర్ చాప భాస్కర్ యాదవ్

 :
శామీర్ పేట్, జనంసాక్షి :ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏనాడు కార్యకర్తలను పట్టించుకోలేని మంత్రి మల్లారెడ్డి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎల్లవేళలా అందుబాటులో
ఉంటానని అనడం శోచనీయమని మేడ్చల్ జిల్లా బి ఆర్ ఎస్ వి కో ఆర్డినేటర్ చాప భాస్కర్ యాదవ్ అన్నారు.పార్టీలో కుటుంబ సభ్యలకు, భజనపరులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి కార్యకర్త ల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు పార్టీ లో ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కుంటూ
హీనమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, ఇప్పటి కైనా పార్టీని నష్ట పరుస్తున్న నాయకులకు పదవులు ఇవ్వొద్దని హెచ్చ రించారు.